- రాష్ట్రంలో ఇప్పటి వరకు 35.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం
- రూ. 6 వేల 369 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశాం
- రూ.267 కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించాల్సి ఉంది
- గురువారం కూడా రూ. 42.12 కోట్లు రైతులకు చెల్లించాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
రాష్ట్రంలో రబీ సీజను సంబంధించి ఇప్పటి వరకు 35 లక్షల 45 వేల 191 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 6,369,31 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పారు. ఇంకా రూ. 267,76 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు . గురువారం ఒక్కరోజే రూ. 42.12 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. అనంతపూర్ జిల్లాలో 18 వేల 848 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 35.31 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో 2 వేల 356 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ.2.02 కోట్లు చెల్లించామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 11 లక్షల 69 వేల 292 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 2,094.64 కోట్లు చెల్లించామని, గుంటూరు జిల్లాలో ఒక లక్షా 57 వేల 012 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ. 273. 39 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 15 వేల 070 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ. 27.70 కోట్లు చెల్లించామని, కృష్ణాజిల్లాలో 4 లక్షల 01 వేల 140 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ. 702.69 కోట్లు చెల్లించామన్నారు. కర్నూలు జిల్లాలో 12 వేల 160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రూ . 19.67 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 77 వేల 649 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు రూ.139.59 కోట్లు చెల్లించామన్నారు. నెల్లూరు జిల్లాలో 2 లక్షల 54 వేల 627 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ.460.95 కోట్లు చెల్లించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 20 వేల 440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రూ.35.01 కోట్లు చెల్లించామన్నారు. విశాఖపట్నం జిల్లాలో 15 వేల 192 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రూ.23.35 కోట్లు చెల్లించామన్నారు. విజయనగరం జిల్లాలో 14 వేల 797 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రూ. 18.14 కోట్లు చెల్లించామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 13 లక్షల 86 వేల 608 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రైతుల ఖాతాలకు రూ .2,536 , 94 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇంకా అనంతపూర్ జిల్లాలో రూ.27 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ.2.43 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ . 90,07 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.23.05 కోట్లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ.51 లక్షలు, కృష్ణాజిల్లాలో రూ. 49.97 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ.3.22 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ. 6. 64 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ. 19.36 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ. 3.19 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.5.03 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ. 9.50 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 54.52 కోట్ల బకాయిలను రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బకాయిల చెల్లింపులు అప్ లోడ్ దశలో ఉన్నాయని, ఆయా జిల్లాల్లో అప్లోడ్ చేసిన వెంటనే చెల్లింపులు జరుపుతామన్నారు. చెల్లింపులకు సరిపడా నగదు సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రి కొడాలి నాని తెలిపారు.