పేదల ఇళ్ళను పిచ్చుకల గూళ్ళు అంటున్న బాబు

పేదల ఇళ్ళను పిచ్చుకల గూళ్ళు అంటున్న బాబు
Spread the love

జాకీలు, క్రేన్ లతో ఎల్లో మీడియా పైకి లేపాలని చూసినా.. బాబు లేవలేడు

పేదల ఇళ్ళను పిచ్చుకల గూళ్ళు అంటున్న బాబు, మరి 224 చ.అడుగుల్లో భవంతులు కట్టాడా..?

మా ప్రభుత్వం 340 చ. అడుగుల్లో 31 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ళు నిర్మిస్తుంటే విమర్శలా..?

మొత్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం.. కొత్త ఊళ్ళను క్రియేట్ చేస్తున్నాం

25 లక్షలు ఇళ్ళు కడతానని మాట ఇచ్చి.. 28 లక్షలకు పైగా కట్టడం మాట తప్పడమా..?

– టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని చంద్రబాబు మధ్యలో వదిలేస్తే.. మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే పేదలకు ఇవ్వాలని మా ప్రభుత్వం టైమ్ బౌండ్ ఫిక్స్ చేసింది.

టీడీపీ అనుకూల మీడియా జాకీలు, క్రేన్ లతో చంద్రబాబును రాజకీయంగా పైకి లేపాలని చూస్తున్నా.. లేచి నిలబడగలిగే సత్తువ చంద్రబాబుకు లేదన్న నిజాన్ని వారు గ్రహిస్తే మంచిదని మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు 5 ఏళ్ళల్లో 25 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తానని శ్రీ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక 31 లక్షల ఇళ్ళ నిర్మాణం చేయడం మాట తప్పడమా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలోని 31 లక్షల మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఒక మహాయజ్ఞంలా పక్కా ఇళ్ళు నిర్మాణం చేస్తుంటే.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చెప్పే అవాస్తవాలు, అభూతకల్పనలకు ఎల్లో మీడియా ప్రాధాన్యత కల్పిస్తుందని ధ్వజమెత్తారు. పేదల ఇళ్ళను పిచ్చుక గూళ్ళుతో పోలుస్తున్న చంద్రబాబు నాయుడు, తన హయాంలో 224 చదరపు అడుగుల్లో ఏమైనా భవంతులు కట్టించాడా అని సూటిగా ప్రశ్నించారు. మా ప్రభుత్వం 340 చదరపు అడుగుల్లో పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తుందని, 17వేల జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని, ఇవన్నీ కొత్తగా రాబోతున్న ఊళ్ళు అని గుర్తు చేశారు. జగనన్న కాలనీలు నిర్మాణంలో ఈ ప్రభుత్వం కృత నిశ్చయం, పట్టుదల, యజ్ఞ సంకల్పంతో ఉందని, ఆ తపనతో ముఖ్యమంత్రిగారితో పాటు మంత్రులు, అధికారులు పని చేస్తున్నారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే..

1- ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు నాయుడును ఉద్దరించేందుకు కొన్ని పత్రికలు, టీవీ చానల్స్‌ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే టిడ్కో ఇళ్ల గురించి.. “గూడు కట్టిన నిర్లక్ష్యం” అంటూ ఈనాడు పేజీల కొద్దీ వార్తలను ప్రచురించింది. చంద్రబాబు హయాంలో ఏదో ఉద్ధరించారని, ఆయన చేయనిదానిని కూడా చేసినట్టు భూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తోంది ముఖ్యంగా ఈనాడు దినపత్రిక.

  • కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సగంలో నిలిచిపోయిన టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, వాటిని లబ్దిదారులకు అందించేందుకు టైమ్‌ బౌండ్ ఫిక్స్‌ చేసి, త్వరలో పూర్తి చేస్తున్నట్లు చెప్పాం, ఇవన్నీ స్టీమ్‌లైన్‌ చేశాం, ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. జగన్‌గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా 1 లక్షా 40వేల ఇళ్లను పూర్తి చేసి, రూపాయికే లబ్దిదారులకు అందచేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా టిడ్కో గృహ సముదాయాలను తెరమీదకు తెచ్చి, అబద్ధాలు, అసత్యాలతో వార్తా కథనాలను వండి వార్చారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే నీతిమాలిన ఆలోచన, దుర్బుద్ధితో ఈనాడు ఇటువంటి కథనాలను రాసింది.

2- గత ప్రభుత్వం అట్టహాసంగా షేర్‌ వాల్‌ టెక్నాలజీ అంటూ.. ఏడాదిలోనే ఇళ్లు కట్టించి ఇస్తామని ఆర్బాటం చేసి టిడ్కో హౌసింగ్‌ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చింది. 7లక్షల ఇళ్లను నిర్మిస్తామంటూ కేంద్రం నుంచి అనుమతి తీసుకుని… 4లక్షల 54వేల ఇళ్లకే జీవో విడుదల చేసి, అందులో 3 లక్షల 13 వేల ఇళ్లను ప్రారంభించి, అందులో 50వేల 616 ఇళ్లను గ్రౌండ్‌ చేశారు. మిగతావాటిని గాలికి వదిలేశారు.

  • టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలు ఏమీ చేయలేదు. అయితే వాటిని ఆపడానికి (క్యాన్సిల్‌) కారణం ఏంటంటే జగనన్న ఇళ్ల పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆప్షన్‌ ఇచ్చాం. టిడ్కోలో లబ్దిదారులుగా ఉన్నవారు కావాలనుకుంటే ఆ ఇంటిని రూపాయికే ఇస్తాం. అది కాకుండా జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పక్కా ఇళ్ళ స్కీములో, ఇండిపెండెంట్ గా స్థలం ఇచ్చి రూ. 1లక్షా80వేలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి, రూ. 50 నుంచి 70 వేలు వరకు ఖర్చు అయ్యే మౌలిక సదుపాయాలు ఇస్తామని చెప్పాం. ఏది కావాలో కోరుకోమంటే.. తమకు ఇండివీడ్యువల్‌ ఇళ్లే కావాలని లబ్ధిదారులు ఆప్షన్‌ కోరుకున్నారు.

3- సుమారు 163 లోకేషన్లలో 90వేల యూనిట్లలో నిర్మాణం అవుతున్న సుమారు 2లక్షల 62వేల ఇళ్లను పూర్తి చేసి .. ఇవాళ్టి నుంచి 180 రోజుల్లో 90 వేల ఇళ్ళను ప్రజలకు అందించడం జరుగుతుంది. దానితో పాటు మిగతా 90వేల ఇళ్లను 12 నెలల్లో పూర్తి చేస్తాం. మిగిలిన 75వేల ఇళ్లను18 నెలలలో పూర్తి చేసి ఇస్తాం.

4- ఈ ప్రభుత్వం ఇచ్చని మాట ప్రకారం పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేస్తోంది. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పాపం చంద్రబాబు ఏం చేసినా, ఈనాడు ఏమి రాసినా.. ప్రజలు మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తారు. సంకల్పం మంచిదైతే ప్రజలు ఆశీర్వదిస్తారు.

ఎవరివి పిట్టగూళ్లు, పిచ్చుక గూళ్లు..?
5- ప్రభుత్వం పిట్టగూళ్లులా ఇళ్లు కడుతోందంటూ చంద్రబాబు చెబుతున్నారు. ఆయన ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. పిచ్చుక గూళ్లు గురించి కూడా ప్రజలకు తెలియాలి. చంద్రబాబు హయాంలో అయిదేళ్లలో సుమారు 6 లక్షల ఇళ్లు కట్టారు. ఇప్పుడు జగన్‌ గారు వచ్చిన రెండేళ్లలోనే 28 లక్షల 30వేల ఇళ్లు కడుతున్నారు.

6- పిచ్చుక గూళ్లు గురించి కూడా ప్రజలకు తెలియాలి. చంద్రబాబు హయాంలో 224 చదరపు అడుగుల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1లక్షా 50వేలతో కట్టారు. అదే జగన్‌ మోహన్‌ రెడ్డిగారి హయాంలో జగనన్న కాలనీల్లో 340 చదరపు అడుగుల్లో.. ఒక్కో ఇంటి నిర్మాణానికి ఒక లక్షా 80వేలు ప్లస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఒక్కో ఇంటికి రూ. 50 నుంచి 70 వేలు ఖర్చు అవుతుంది. దాంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఖర్చు.. రూ. 2 లక్షల 25వేల నుంచి రూ.2.50లక్షల వరకూ అవుతుంది. ఎవరివి పిచ్చుక గూళ్లు? చంద్రబాబు 224 చదరపు అడుగలలో కట్టిన ఇళ్లా? లేక, 340 చదరపు అడుగులతో మేం కడుతున్న ఇళ్లు పిచ్చుక గూళ్లా?. చంద్రబాబు నాయుడుగారు కానీ, ఆయన హయాంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులు గానీ వాస్తవాలను చెప్పమనండి. చంద్రబాబు పెద్ద పెద్ద భవంతులు కట్టించి ఇచ్చారా? చెప్పమనండి?

7- వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. దయచేసి సంయమనం పాటించండి. జాకీలు, క్రేన్‌లు తీసుకువచ్చి చంద్రబాబును పైకి లేపుదామంటే అది కుదరదు. టిడ్కో ఇళ్లపేరుతో టీడీపీ హయాంలో ప్రజల సొమ్మును దోచుకుతింటే ఈ ఎల్లో మీడియాలో ఎప్పుడైనా వార్తలు రాశారా? ఆనాడు ఎందుకు తప్పు అని చెప్పలేదు?

8- మాకు ప్రజలు అయిదేళ్లపాటు పరిపాలన చేయాలని అవకాశం ఇచ్చారు. మేము చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజల సహకారం అందిస్తున్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రిగారు పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో, పట్టుదలతో, యజ్ఞ సంకల్పంతో జగనన్న కాలనీలను నిర్మాణం చేస్తుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *