The former minister who gave a strong counter to Minister Anil …
నోటిపారుదలశాఖా మంత్రి…మీ పాలనలో అవినీతి ఎక్కువే..అరాచకమూ ఎక్కువే. జగన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్. డ్యాములు నిండినా చుక్కనీరు వాడుకోవడానికి పనికిరాదు. కర్నూలు న్యాయరాజధాని అన్నాడు కరోనా కల్లోలంలో చిక్కింది. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నుంచీ ఎల్జీ పాలీమర్స్, సాయినార్, హెచ్పీసీఎల్, షిప్‌యార్డ్ ప్రమాదాలలో వందల మంది చనిపోయారు. దుర్గమ్మకి చీరసమర్పించేందుకు వెళ్లాడు. కొండచరియలు విరిగిపడ్డాయి.
కచ్చులూరు బోటు ప్రమాదంలో 60 మంది చనిపోయారు. ఇదంతా దరిద్రపాదం కాదా అనిల్. పులిచింతల అవినీతిపై విచారణ జరిపి పుణ్యం కట్టుకో నాయనా!మేయించిన మహామేత లేడు కానీ, మేసిన యువమేత వున్నాడు. అడ్డంగా దొరుకుతాడు. ప్రభుత్వంలో ఉండి అన్నింటికీ చంద్రబాబే కారణమని చెప్పడానికి కనీసం సిగ్గుపడడంలేదు. చంద్రబాబు తెచ్చిన కియా మీరే తెచ్చారని..సభలో నిస్సిగ్గుగా ఉత్తరం చదువుతారు. పులివెందుల పులకేశీల పాపం పులిచింతలకి శాపమైతే..చంద్రబాబుపై ఏడుస్తావేంటి బెట్టింగ్ బంగార్రాజూ!మంగళవారం కబుర్లు ఆపి గేటు బిగించే పని చూడు .