ఇంత చేతగాని వాడ మా సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంత చేతగాని వాడ మా సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు.
Spread the love

2600 రైతు వేదికలు నిర్మించారు.
రైతు బంధు ఇచ్చారు.
రుణమాఫీ అన్నారు.
అన్నీ ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కెసిఆర్.

ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే ఈ సమస్య తీరుతుంది.

అది చెయ్యకుండా.. జిద్దు కు పోతున్నారు.
శంకుని వేషాలు వేస్తున్నారు.

ఇంత సిగ్గు మాలిన, చేతగాని, బేల తనం ఎందుకు?
ఇంత చేతగాని వాడ మా సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు.

ఈటల రాజేందర్.
……………….

దేశంలో వ్యవసాయ రంగం అత్యంత కన్ఫ్యూజన్ లో ఉంది ఒక్క తెలంగాణలో మాత్రమే.

అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టు..
కోపం ఉంటే కేంద్రం మీద బీజేపీ మీద ఉండాలి కానీ రైతులు మీద చూపిస్తున్నారు.

ధాన్యం సేకరణ వ్యవస్థ ఈరోజు వచ్చింది కాదు.
అనేక సంవత్సరాలుగా నడుస్తుంది.

మన రాష్ట్రం డిసెంట్రలైజెడ్ ప్రొక్యుర్మెంట్ పద్దతి లో ధాన్యం సేకరణ చేస్తున్నాం.

ధాన్యం సేకరణ ప్రక్రియకు అవసరం అయిన అన్నీ డబ్బులు కేంద్రమే ఇస్తుంది. వడ్లు కొనడానికి, గన్నీ సంచులకు,
సుతిల్ దారానికి, మహిళా సంఘాలకు కమీషన్ కు,
ట్రాన్స్పోర్ట్ కు, నిల్వ ఉంచడానికి కిరాయికి, చివరికి వడ్డీ కూడా కేంద్రమే ఇస్తుంది. రాష్ట్రం ఖర్చు పెట్టదు. కానీ ఇన్ని రోజు లు అన్నీ మేమే చేస్తున్నాం అని కెసిఆర్ చెప్పుకున్నారు.

మన రాష్ట్రంలో రైస్ మిల్లర్లు కేవలం కస్టమ్ మిల్లింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు.మాకు సబ్సిడీ ఇవ్వండి, జాగ ఇవ్వండి అని సీఎం గారిని కోరారు. సీఎం కూడా మీటింగ్ పెట్టాడు. కానీ మిల్లులకు సబ్సిడీ ఇచ్చారా ? ఎన్ని మిల్లులకు జాగా ఇచ్చారు ? ఎన్ని మిల్లులకు కరెంట్ సబ్సిడీ ఇచ్చారో..
సీఎం చెప్పాలి.

తెలంగాణలో పండిన పంట మెత్తాన్ని..
మిల్లర్లు మిల్లింగ్ చేయలేరు.

కెసిఆర్ కి ముందుచూపు లేక, పట్టించుకోక ఇప్పుడు కేంద్రం మీదకు నెట్టి వేసే నీచమైన స్థితికి కెసిఆర్ దిగారు.

విజ్ఞత గల నాయకులు, కార్యకర్తలు , ప్రతిపక్ష పార్టీలు ఆలోచించండి. పార్టీ ఆఫీస్ ల మీద డాడీ చేసే సంస్కృతి ఉందా?
ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే దాడులను ప్రోత్సహిస్తుంది.
లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన భాద్యత తన మీద ఉంది అని కెసిఆర్ మర్చిపోతున్నారు.

ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల రక్తం కళ్ళ చూస్తున్నారు.
ఆయన తప్పులను పక్కవారి మీద వేస్తున్నారు కెసిఆర్.

ఒక్క మాట సూటిగా సమాధానం చెప్పాలి సీఎం గారు..
కేంద్రం డబ్బులు ఇస్తుంది అని మీరు రైతు భీమా ఇచ్చారా?
రైతు బంధు ఇస్తున్నారా? ఫేజ్ రీఎంబర్స్ మెంట్ ఇస్తున్నారా ?
వాటన్నిటికీ లేని ఇబ్బంది ధాన్యం కొనుగోలుకు ఎందుకు వస్తుంది. మీకు రైతులమీద ప్రేమ ఉంటే ఎందుకు ఇవ్వరు.
బియ్యం కొనుగోళ్ల ఎందుకు కేంద్రం మీద నెడుతున్నారు.
కేంద్రం అయినా రాష్ట్రం అయినా రైతులకు, ప్రజలకు ఇచ్చేదే ప్రజల డబ్బు.

పెన్షన్ డబ్బులు కూడా మేమే ఎక్కువ ఇస్తం అని చెప్పుకుంటున్న మీరు, ఎందుకు రైతులకు ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు.

ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే ఈ సమస్య తీరుతుంది.

అది చెయ్యకుండా.. జిద్దు కు పోతున్నారు.
శంకుని వేషాలు వేస్తున్నారు.

ఇంత సిగ్గు మాలిన, చేతగాని, బేల తనం ఎందుకు?
ఇంత చేతగాని వాడా మా సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు.

సీఎం వద్దు అన్నారు అని మన రైతులు 20 లక్షల ఎకరాల్లో వరి పంట వేయలేదు.
నీళ్ళు ఉన్నా, కరెంటు ఉన్నా వరి కి దూరంగా ఉన్నారు.

కోటి ఎకరాలు అని మీరు మాట్లాడుతున్నా రు కదా.. వరి వేయకపోతే ఎందుకు ప్రాజెక్ట్స్ కట్టారు
ఎందుకు కరెంటు ఇస్తున్నారు.

ఈ సీజన్ కూడా ఎంత అయినా రా రైస్ అయినా కొంటాం అని కేంద్రం చెప్పింది.

ఫార్బోయిల్డ్ రైస్ ను కేరళ, తమిళ నాడుకు గతంలో పంపేవారు కానీ ఇప్పుడు వారే వడ్లు పండించుకుంటున్నారు. రా రైస్ తింటున్నారు.

మేము ఫర్బాయిల్డ్ రైస్ పెట్టం అని రాష్ట్రం, కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా ?
ఈ లెటర్ మీరు రాసింది కాదా ?
ఇన్ని అబద్ధాలా ?

కేంద్రం కొన్నా కొనకపోయినా మేము కొంటాం అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణ రైతులు ఉసురు పోసుకుంటున్నారు.

రేపు కెసిఆర్ ప్రభుత్వం కూలి పోతుంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వం.
వర్షం కాలం, ఎండా కాలం రెండు పంటలు గింజలేకుండ కొనే భాద్యత మాది. రాష్ట్ర రైతాంగం ను కాపాడుకుంటం.

సీఎం గారు ధాన్యం కొనుగోలు చేయండి.
రాజకీయాలు చేయవద్దు.
ప్రజలమధ్య చిచ్చు పెట్టవద్దు.
నెత్తి మీద దాకా తెచ్చుకోవద్దని చెప్తున్నా అని ఈటల రాజేందర్ అన్నారు.

గిరిజన రిజర్వేషన్:
గతంలో …
Sc 14% to 15 %
St 4% to 6% చేశారు.
రాజ్యాంగ సవరణ లేకుండా చేశారు.
ఇప్పుడు కూడా చేయవచ్చు..
చేయండి.

కానీ కెసిఆర్ ఒక పీటముడి వేసి పెట్టారు.

సీఎం తన పనులకోసం అయితే ఆగమేఘాల మీద పని చేయించుకుంటారు నోరు లేని గిరిజనుల కోసం ఎందుకు చేయరు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *