ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి – Bandi

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి – Bandi
Spread the love

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి

లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి కేసీఆర్ దిగిపోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్

రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు

బైల్డ్ రైస్ కేంద్రానికి పంపమని కేంద్రానికి లేఖ రాసింది మిరే కాదా కేసీఆర్

కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నామని చెప్పింది నువ్వే కాదా కేసీఆర్

కేంద్రం మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చుస్తే చూస్తూ ఉరుకోమ్ కేసీఆర్

ముఖ్య మంత్రి కేసీఆర్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల జీవితాలతో అడుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాని హెచ్చరించారు.రైతులు పండించిన ధాన్యాన్ని కేసీఆర్ సర్కార్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు.బైల్డ్ రైస్ ఇక రాష్ట్రము నుండి పంపించమని కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. కేంద్రం మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చుస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రానికి ధాన్యం ఇవ్వను అని చెప్పారు కాదా కేసీఆర్ …ఇక రైతులు పండించిన ప్రతి గింజను కొనాలి లేని పక్షంలో బీజేపీ రైతుల పక్షాన ఉద్యమిస్తోంది.వరి వేస్తే ఉరి అని చెప్పి రైతుల జీవితాలతో ఆటలు అడుకుంది టి ఆర్ ఎస్ ప్రభుత్వం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.వరి వేస్తే ఉరి అంటే హుజురాబాద్ ప్రజలు మీకు బుద్ధి చెప్పింది వాస్తవం కాదా కేసీఆర్ అంటూ చురకలు అంటించారు.కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తాను అని చెప్పింది మిరే కదా కేసీఆర్. ఇప్పుడు పంటలు కోత కు వచ్చాయని ఆ నెపం కేంద్రం మీద నెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం బండి వ్యక్తం చేశారు.కేంద్రం ధాన్యం కొనదు అని ఎప్పుడైన చెప్పిందా కేసీఆర్ అని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్న కేంద్రనాకి ధాన్యం ఇవ్వనని రైతుల పట్ల కక్షపురితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.ఫామ్ హౌస్ లో పండించిన పంటను కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా కోట్ల రూపాయలకు సీఎం కేసీఆర్ ఎక్కడ అమ్ముకుంటూన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తే బీజేపీ చూస్తూ ఉరుకొదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *