#LIVE లో డబుల్ బెడ్ రూమ్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి.
LIVE లో డబుల్ బెడ్ రూమ్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో NIC అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ సహకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీన కుత్భుల్లాపూర్ లో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ని ప్రారంభిస్తారు. GHMC పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది లబ్దిదారులకు చొప్పున మొదటి విడతలో 12 వేల ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది.
మూసీ నది అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ఆక్రమణల తొలగింపుతో నిరాశ్రయులు కానున్న సుమారు 9 వేల మంది బాధితులకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరుగుతుంది. ఈ ఇండ్ల కేటాయింపు కు సంబంధించి అర్హుల ఎంపిక లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా అన్ లైన్ డ్రా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, చేవెళ్ళ MP రంజిత్ రెడ్డి గారు, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ మధుసూదన్, DRO వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.