తెలంగాణ డబల్ బెడ్ రూమ్ 4వ విడత ఉందా? లేదా?
తెలంగాణ డబల్ బెడ్ రూమ్ ఇప్పటికి 3 విడత లు పూర్తి చేసుకుంది. అయితే 4 విడత ఉంటుందా లేదా అనే సందేహం ఎంతో మందికి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికె 5, 6 విడతల్లో ఇస్తామని ప్రకటించింది. అయితే లక్ష ఇళ్లలో ఇప్పటికే చాల ఇల్లు ఇచ్చేసారు. మరి 4 వ విడత లో ఎన్ని ఇస్తారు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 3 వ విధాత లో భాగంగా 36884 లబ్ది దారులను ప్రకటించారు. అంటే 4 వ విడత కూడా ఉంటుంది చెప్పినట్లే. ఎవరూ కూడా కంగారు పడకండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన tanvi techs ఇంస్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. రిప్లై ఇస్తాను.
https://www.instagram.com/tanvitechs/
హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మూడవ విడత పంపిణీ లో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించి 36884 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది.మూడవ విడత ప్రక్రియలో వికలాంగులకు 1843, ఎస్సీలకు 6271, ఎస్టీలకు 2215, ఇతరులకు 26555 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను కేటాయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి,డిఆర్ఓ వెంకటాచారి, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.