విజయనగరం పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని, యుమమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్‌లతో కలసి విజయనగరంలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన అంశాలు…..
1). అమిత్‌షాతో జూనియర్ ఎన్‌టీఆర్ కలవడాన్ని వైకాపా విమర్శిస్తే ఆయనకు 18 కోట్ల భాజపా సభ్యులు అండగా ఉంటారు.
రాజకీయాలతో సంబంధం లేని జూనియర్ ఎన్‌టిఆర్ పేరు మార్పు విషయంలో చేసిన ట్వీట్‌లో ఏం తప్పుంది?
నాడు పోలవరం పేరు , నేడు యూనివర్సిటీ ల పేర్లను పెట్టుకుంటూ, మార్చుకుంటూ వివాదాలను కారణం
అవుతున్నారు.
ప్రజలు నేటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు గమనిస్తున్నారు .
ఎన్‌టిఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాలకు తమ పేర్లు పెట్టుకోలేదు.
కాంగ్రెస్ ఎన్నో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టుకుంటే భాజపా ఏనాడూ పేర్లు మార్చలేదు. ప్రజలను ఊచకోత కోసిన ఔరంగజేబు పేరును ఢల్లీిలో మార్చి దానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాం.
కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సర్ధార్ వల్లభాయ్‌పటేల్‌లకు గౌరవం కల్పించి స్మారక చిహ్మాలు నిర్మించాం.
విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి పేరు మార్చాలి. గుంటూరు జిల్లా టవర్ సెంటర్ పేరు మార్చి దేశభక్తుల పేర్లు పెట్టాలి.
2). రాష్ట్ర మంత్రులు నోరుజారి, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ా అదుపు తప్పి, సిగ్గులేకుండా పిచ్చిపట్టిన వారి వలే మాట్లాడుతున్నారు. వారిని ముఖ్యమంత్రి అదుపులో పెట్టాలి. వారికి మానసిక వైద్య చికిత్స అందించాలి.
` ఉపముఖ్య మంత్రి తమను ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు ఆపుతామంటారు.
సిదిరి అప్పలరాజు ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటామంటారు.
బోత్స సత్సనారాయణ పాదయాత్రను 5 నిమిషాల్లో ఆపేస్తానంటున్నారు. అంబటి రాంబాబు అడ్డగోలుగా ఎదుటివారిని దూషిస్తున్నారు. ఎదుటివారిని బూతులు తిట్టడం అర్హతగా భావిస్తున్నారా?
` ప్రజలు కట్టే పన్నులతో సకల సౌకర్యాలు, పదవులూ అనుభవిస్తూ, వారినే దూషిస్తారా? మీ జేబులో డబ్బు ఇస్తున్నారా?
` మంత్రుల విషయంలో సిఎం ప్రజలకు సమాధానం చెప్పాలి.
3). ఎపీలో రుణ యాప్‌ల వత్తిడి కారణంలో 26 మంది నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు, అల్పాదాయాల వారు రుణయాప్‌ల ఉచ్చులో పడి అవసరాల నిమిత్తం రుణాలు తీసుకుని వారి వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో విచారణ చేపట్టి నేరస్తులను చట్టప్రకారం శిక్షించాలి.
` తక్షణం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి యాప్‌లను అదుపు చేయడానికి నూతన ఐటీ చట్టం చేయాలి.
4). దసరా పండుగ సందర్భంగా ఆలయాల్లో రూ.300, రూ.500 ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో చేస్తున్న దోపిడిని ఆపాలి.
` భక్తులకు సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
5). కోర్సులు పూర్తయిన వారికి జగనన్న విద్యా, వసతి దీవెన పథకాల ద్వారా ఫీజులు విడుదల చేయక ఆపివేయడంతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్నారు. కోర్సు పూర్తయిన వారికి బకాయి ఫీజులు వెంటనే చెల్లించాలి.