పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి
ప్రెస్ మీట్ పాయింట్స్
• వైసీపీ ప్రభుత్వం రూపొందించిన పథకాలన్నీ అవినీతిమయమే
• ఏ స్కీమ్ చూసినా ఏమున్నది గర్వకారణం?
• ఏ స్కీమ్ చూసినా వైసీపీ నేతలు, వాలంటీర్ల హస్తగతం
• చంద్రబాబు పాలనలో పారదర్శకంగా పథకాలు అందించాం
• టీడీపీ హయాంలో రైతు కూలీల పిల్లలు సగౌరవంగా సాఫ్ వేర్ ఉద్యోగాలు చేశారు
• వైసీపీ హయాంలో లంచాలు తీసుకునే వాలంటీర్లు తయారయ్యారు
• వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలను నిండా ముంచింది
• రెక్కాడితే డొక్కాడని పేదలను లంచాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పీక్కుతింటోంది
• పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి వేలకోట్లు దండుకోవడమేనా మద్యపాన దశలవారీ నిషేదమంటే?
• జే ట్యాక్స్ పేరుతో ఏడాదికి రూ. 5 వేల కోట్లు లూటీ చేస్తున్నారు
• ఇసుక మాటున సంవత్సానికి రూ. 5 వేల కోట్లు మింగేస్తున్నారు
• సెంటు పట్టా పథకం పేరుతో ఏడాదికి రూ. 4 వేల కోట్లు దోచేస్తున్నారు
• బర్త్ సర్టివికెట్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా వాలంటీర్ కు లంచం ఇవ్వాలి
• వాలంటీర్లు కాదు వసూల్ రాజాలు
• డ్వాక్రా గ్రూపుల నుంచి యానిమేటర్లు డబ్బులు వసూలు చేసి వైసీపీ నేతలతో పంచుకుంటున్నారు
• ఒక్కో డ్వాక్రా గ్రూప్ నుంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు.
• రూ. 10 వేలు లంచం ఇస్తేనే మహిళ ఏ కులమో వాలంటీర్ ధువీక్రరణ పత్రం ఇస్తాడు.
• అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
• అమ్మఒడి కింద డబ్బు ఇచ్చి వెనక్కు లాక్కోడాన్ని లూటీ అనక ఏమంటారు?
• మత్స్యకార భరోసా పేరుతో మోసం చేశారు
• ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా రోగులకు సాయం అందలేడంలేదు
• అంబులెన్స్ ల నిర్వహణలో రూ. 307 కోట్లు కొట్టేశారు
• ఇళ్ల స్థలాల మాటున వైసీపీ నేతలు భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు
• మున్సిపల్ ఏరియా స్థలం కేటాయించాలంటే రూ. 30 వేలు, రూరల్ ఏరియాలో రూ. 15 వేలు లంచం తీసుకుంటున్నారు.
• చంద్రబాబు హయాంలో కట్టిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా మార్చారు
• వాహనమిత్ర పథకం పెద్ద భూటకం
• చేసే పని చిత్తశుద్ధితో చేయడం చంద్రబాబును చూసి వైసీపీ నేర్చుకోవాలి
• వైఎస్సార్ ఆసరా కింది నిజమైన లబ్ధిదారులకు సాయం అందలేదు
• కుట్టు మిషన్ ఉన్నచోటల్లా వైసీపీ నేతలు వాలిపోయి ఫోటోకు ఫోజులిస్తున్నారు
• 30 లక్షలమంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారు
• మోటర్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరితాడు వేస్తున్నారు
• వైసీపీ ప్రభుత్వం స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేస్తోంది
• రూ. 2.50 పైసలకు వచ్చే విద్యుత్ ను రూ.11 కు ఎందుకు కొంటున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
• ముఖ్యమంత్రి సహాయనిధి కింద వైసీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు
• జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు మింగబట్టే 11 చార్జ్ షీట్లు వేశారు
• చీప్ మినిస్టరా-కాపీ మినిస్టరా అని జగన్మోహన్ రెడ్డి గురించి జనం అనుకుంటున్నారు
• చంద్రబాబు హయాంలో పథకాలన్నింటి కాపీ కొట్టి పేర్లు మారుస్తున్నారు
• టీడీపీ హయాంలో 63 నీటి ప్రాజెక్టులను రూ. 83 వేలతో కడితే వైసీపీ ప్రభుత్వం ఒక్క సెంటుకు నీరివ్వలేదు
• యువనేస్తం, పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఎందుకు తీసేశారు?
• అమరావతికి జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారు
• పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారు
• వృద్ధులకు పింఛను అందాలంటే వాలంటీర్లకు లంచం ఇవ్వాలా?
• జగన్మోహన్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలి
• టీడీపీ హయాంలో కొనుగోలు చేసిన సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమిది
• లంచం ఎందుకివ్వాలని ప్రజలు తిరగబడి ప్రశ్నించాలి