తెలంగాణాలో తీరందరికి 2000 బ్యాంకులోకి, 25 కేజీలు రేషన్ ఉచితం

తెలంగాణాలో తీరందరికి 2000 బ్యాంకులోకి, 25 కేజీలు రేషన్ ఉచితం
Spread the love

తెలంగాణాలో తీరందరికి 2000 బ్యాంకులోకి, 25 కేజీలు రేషన్ ఉచితం.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేంతవరకు నెలకు రూ.2000, వారి కుటుంబాలకు 25 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సాయం ఏప్రిల్ నెల నుంచి అమలవుతుంది. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు.రేపు ఉదయం 11:30 గంటలకు బీఆర్కె భవన్ లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈఓలు పౌరసరఫరాల శాఖ డిఎస్ ఓ లు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *