ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్

ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్
Spread the love

*ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్*- – విపత్కర సమయంలో ఆసుపత్రుల యజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి- – ధరల పట్టిక ఏర్పాటు చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం- – కష్టకాలంలో పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలి- – మందులు, ఆక్సిజన్ కోసం అధిక డబ్బులు వసూలు చేస్తే కేసులునల్లగొండ : కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా హృదయంతో కరోనా రోగులకు సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కరోనా సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఆత్మస్థైర్యంతో సరైన రీతిలో మందులు, ఆహారం తీసుకుని కరోనాను జయించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కొన్ని ఆసుపత్రుల్లో అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల ప్రకారం చికిత్సల కోసం డబ్బులు తీసుకోవాలన్నారు. అనేక ఆసుపత్రులలో ఆక్సిజన్ కు సైతం అధికంగా చార్జీలు చేస్తున్నారని దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఆక్సిజన్ సరఫరా చేసే విగ్రహాల ఆనంద్ పై అధిక చార్జీ వసూలు చేస్తుండడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. అదేవిధంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి సూర్య ఆసుపత్రిలో 36 డోసుల రేమిడిసివర్ ఇంజెక్షన్లను సీజ్ చేశామని తెలిపారు.

*ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు ఇలా…..

*కోవిడ్ కష్ట కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రులలో చికిత్సలు, ఇతర అంశాలకు తీసుకోవాల్సిన చార్జీలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని అందుకు అనుగుణంగా చార్జీలు వసూలు చేయాలని, వాటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సాధారణ వార్డు, ఐసోలేషన్, నిర్దేశించిన పరీక్షలకు గాను 4,000 రూపాయలు, ఐసియు చికిత్సతో కూడిన ఐసోలేషన్, ఇసిజి, ఎక్స్ రే, మందులు ప్యాకేజీకి 7,500 రూపాయలు, వెంటిలేటర్ తో కూడిన ఐసియు చికిత్స, రోగికి భోజనం, నిర్దేశించిన వైద్య పరీక్షలకు 9,000 రూపాయలు చార్జీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా కోవిడ్ నిర్ధారణ కోసం చేసే RT-PCR పరీక్ష చేయడానికి శాంపిల్స్ ఆసుపత్రి, ల్యాబ్ నుండి నేరుగా స్వీకరిస్తే 2,200 రూపాయలు, ఇంటి వద్దకు వెళ్లి శాంపిల్స్ సేకరిస్తే 2,800 రూపాయలు వసూలు చేయాలని ఆయన సూచించారు. వీటికి విరుద్ధంగా ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఆసుపత్రులలో చార్జీల పట్టిక తప్పనిసరి

కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజికి ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలను ప్రజలందరికీ ఆర్డమయ్యే విధంగా ప్రతి ఆసుపత్రిలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చార్జీల వివరాలను వెల్లడించని ఆసుపత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఐజి రంగనాధ్ హెచ్చరించారు. ఆసుపత్రుల్లో చార్జీల పట్టిక ఏర్పాటు, రోగుల నుండి వసూలు చేస్తున్న చార్జీలు, ఆసుపత్రులలో అందుబాటు ఉన్న బెడ్స్ వివరాలు అన్నింటిపై టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడైనా చార్జీల వివరాలు వెల్లడించని పక్షంలో డయల్ 100 ద్వారా సైతం సమాచారం ఇస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఆక్సిజన్, మందుల లభ్యతపై ప్రత్యేక నిఘా*జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉన్న కోవిడ్ రోగులు, వారి వివరాల ప్రకారం అవసరమైన మందులు, రేమిడిసివర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ లభ్యత గురించి నిరంతర నిఘా ఏర్పాటు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఆక్సిజన్ సరఫరా చేసే విగ్రహాల ఆనంద్ అనే వ్యక్తి అధిక చార్జీలు వసూలు చేస్తున్న కారణంగా అతనిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.*జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కోవిడ్ సహాయ కేంద్రం*ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద *కోవిడ్ సహాయ కేంద్రం* ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి మెరుగైన చికిత్స అందించాల్సి వచ్చే పక్షంలో వారిని ఇతర ఆసుపత్రులకు తరలించే విధంగా ఎస్.ఐ. స్థాయి అధికారి నేతృత్వంలో సహాయ కేంద్రం 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు, ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ల యజమాన్యాలు, ప్రజలు అంతా సహకరించాలని డిఐజి రంగనాధ్ కోరారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: